రాజీవ్ ఎందుకలా చేస్తారు?: షీలా దీక్షిత్
1984లో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో రాజీవ్ గాంధీ వారిని చంపేందుకు ఆదేశాలిచ్చారని సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కాస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఖండించారు. రాజీవ్ గాంధీ ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నించారు. తన తల్లిని కోల్పోయి రాజీవ్ గాంధీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. బీజేపీ తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. ఆ పార్టీ ఇలాగేనా వ్యవహరించేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్‌ను లూటీ చేసినవారి జేబుల్లో నుంచి 'న్యాయ్' నిధులు తీసుకొస్తాం : రాహుల్
న్యాయ్ పథకం కోసం వెచ్చించే నిధులను మధ్యతరగతి ప్రజల నుంచి రాబట్టాలనుకోవడం లేదు. న్యాయ్ పథకం కోసం పన్నుల రూపంలో వారిపై భారం మోపాలనుకోవం లేదు. న్యాయ్ పథకం కోసం వెచ్చించే నిధులను భారత్‌ను లూటీ చేసినవారి జేబుల్లో నుంచి తీసుకొస్తాం. మీకు రాజీవ్ గాంధీ హత్య గురించి మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి.. కానీ రాఫెల్ డీల్‌పై కూడా మాట్లాడండి.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో రెండు విడతల పోలింగ్ మే 12, మే 19 తేదీల్లో జరగనుంది. చివరి రెండు విడతల్లో దేశవ్యాప్తంగా ఉన్న 118 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగా, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించాలని భావిస్తున్న పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గురువారం పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..