హోమ్ /వార్తలు /national /

తెలంగాణలో తొలి ఫలితం..మెదక్‌లో కొత్త ప్రభాకర్ అఖండ విజయం

తెలంగాణలో తొలి ఫలితం..మెదక్‌లో కొత్త ప్రభాకర్ అఖండ విజయం

మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి

మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి

నాలుగు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం సాధించారు.

    తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెదక్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 3,05,691 ఓట్ల భారీ మెజార్టీలో ఆయన గెలుపొందారు. ఉత్తర తెలంగాణ బీజేపీ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్‌కు పోటీనిస్తున్నాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం సాధించారు. దీని వెనక హరీశ్ రావు కృషి ఎంతో ఉంది. కొత్త ప్రభాకర్ గెలుపు బాధ్యతలను తీసుకున్న హరీశ్ రావు ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. తాను ఊహించినట్లుగానే మెదక్‌లో కొత్త ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

    మెదక్ లోకసభ ఎన్నికల్లో TRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.
    హరీశ్ రావు

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, KTR, Lok Sabha Election 2019, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు