Home /News /national /

POLITICS LALU PRASAD YADAV TO CONTEST PRESIDENT POLLS BUT THERE IS A TWIST PVN

President Polls : రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్..ఈయన గెలిస్తే మామూలుగా ఉండదు మరి

రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్

Lalu Prasad Yadav To Contest President Polls : భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్(Ram Nath Kovind) కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక(President Election 2022) కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
Lalu Prasad Yadav To Contest President Polls : భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్(Ram Nath Kovind) కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక(President Election 2022) కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. 16వ భారత రాష్ట్రపతి ఎవరనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ తర్వాత ఆ పదవిని చేపట్టే వ్యక్తిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం అధికార బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. అటు విపక్షాలు కూడా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జూన్ 15న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి.. ఇందుకు 22 విపక్ష పార్టీలను ఆహ్వానించారు. దీంతో రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav)వెల్లడించారు.

జూన్‌ 15వ తేదీన నామినేషన్‌ పేపర్లు దాఖలు చేసేందుకు ఢిల్లీకి ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నట్లు తాజాగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఈయన ఆర్జేడీ చీఫ్‌, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాదు. ఆయన పేరుతో మరో వ్యక్తి. బీహార్‌ రాజకీయాల్లో, ఎన్నికల్లొచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి కారణమయ్యే ఈ లాలూ ప్రసాద్‌ యాదవ్‌... సరన్‌ జిల్లా మరహౌరా అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని రహీంపుర్‌ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్‌ యాదవ్‌(42) వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతనిని అంతా ము‍ద్దుగా కర్మభూమి అని పిలుస్తుంటారు.

Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం

గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు. 2017లో నామినేషన్‌ పేపర్లు కూడా దాఖలు చేశారు. ఆ సమయంలో బీహార్‌ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌.. మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ సమయంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. అందుకే ఈసారి పక్కగా సిద్ధమై ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కుతున్నాడట.

Shocking : పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనిష్క్ సేల్స్ గర్ల్ పై దారుణం!

కాగా, ఆర్జేడీ చీఫ్‌ పేరే కావడం వల్ల గతంలో పలు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లాలూ భార్య, బీహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవీ పోటీచేసిన నియోజకవర్గంలో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నామినేషన్ వేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీపై సుమారు 50వేల ఓట్ల తేడాతో రబ్రీదేవిపై విజయం సాధించారు. రబ్రీ ఓటమికి ఈ లాలూనే కారణమని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్ పేరు చూసి అందరూ పొరపడ్డారట. అంతేకాదు అతడికి సుమారు 10వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పోటీ చేయగా ఆరువేల ఓట్లు లభించాయి.రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడంపై లాలూ మాట్లాడుతూ..."ఇప్పటివరకూ చాలా ఎన్నికల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వచ్చాను. పంచాయతీ ఎన్నికల నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ల వరకు పోటీ చేశాను. గెలిస్తే ఫర్వాలేదు. ఓడితే మాత్రం అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతాను" అని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Lalu Prasad Yadav, President Elections 2022, President of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు