చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన అనంతరం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి ఊపిరాడక మరణించారు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచి బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chittoor S01p25, Ys jagan, Ysrcp