కుత్బుల్లాపూర్‌లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సారి కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో... అది మహాకూటమికి కలిసొస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ సారి కుత్బుల్లాపూర్ తమదే అని టీఆర్ఎస్ ధీమాగా ఉంది.
ఓటర్ల సంఖ్య
ఎన్నికల సంఘం కొత్త లెక్కల ప్రకారం కుత్బుల్లాపూర్‌లో మొత్తం ఓటర్ల సంక్య 5,16,180. వీరిలో పురుషుల సంఖ్య 2,75,025 కాగా, స్త్రీలు 2,41,064. ఇతరుల సంఖ్య 91.
నియోజకవర్గం చరిత్ర
2009 ముందు మేడ్చల్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్... నియోజకవర్గాల పునర్విభజన తరువాత కొత్త నియోజకర్గంగా ఏర్పడింది. 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి, 2014లో టీడీపీ ఇక్కడి నుంచి విజయం సాధించాయి. ఇక్కడ బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరితో పాటు సెటిలర్ల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంతో కీలకం. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ దుండిగల్, బాచుపల్లి, మండలాలు ఉన్నాయి.
2014 ఎన్నికల ఫలితాలు
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.పి.వివేకానంద విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డిపై 39 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి ?
2014లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కె.పి. వివేకానంద టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సారి ఆయనే టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరపున కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇరువురు నేతలు బలహీనవర్గాలకు చెందిన వారే కావడంతో వీరి మధ్య పోటీ బలంగా ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mahakutami, Tdp, Telangana, Telangana Election 2018, Trs