హోమ్ /వార్తలు /national /

సీట్లు పంచుకోలేని వాళ్లు... ప్రభుత్వాన్ని నడుపుతారా ?: కేటీఆర్

సీట్లు పంచుకోలేని వాళ్లు... ప్రభుత్వాన్ని నడుపుతారా ?: కేటీఆర్

చంద్రబాబు చేతికి తెలంగాణ జుట్టు ఇస్తే... ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని కేటీఆర్ అన్నారు. సోనియాగాంధీని ఎంతగానో విమర్శించిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు.

  రెండు నెలల నుంచి సీట్లు పంచుకోవడానికి నానా తంటాలు పడుతున్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారంటూ మహాకూటమిపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే... తెలంగాణ మళ్లీ తిరోగమనం వైపు పయనిస్తుందని అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలోజరిగిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. చంద్రబాబు చేతికి తెలంగాణ జట్టు ఇస్తే... ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని కేటీఆర్ అన్నారు. సోనియాగాంధీని ఎంతగానో విమర్శించిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు.

  దొంగ వేలిముద్రల ద్వారా కేసులు వేసి కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులను నింపుతామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మేలు చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి అని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతాంగానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు.

  కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తమని విమర్శించిన కేటీఆర్... కోదండరాం నెత్తిన కాంగ్రెస్ చెయ్యి పెట్టిందని ఎద్దేవా చేశారు. మూడు సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రైతులను దశాబ్దాల పాటు పీడించిన కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తారా లేక రైతులకు మేలు చేస్తున్న కేసీఆర్‌కు ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని... ఆగమాగం కావొద్దని కేటీఆర్ సూచించారు.

  First published:

  Tags: Chandrababu Naidu, Congress, Kodandaram, KTR, Telangana, Telangana Election 2018

  ఉత్తమ కథలు