హోమ్ /వార్తలు /national /

కాంగ్రెస్‌కు షాక్... బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

కాంగ్రెస్‌కు షాక్... బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (File)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (File)

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ఫిక్సయ్యారని... అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరబోతున్నట్లు తెలిసింది. ఆయన సోదరుడు... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తాను పార్టీ మారట్లేదని చెప్పిన రెండు రోజులకే నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా సంచలన వ్యఖ్యలు చేశారు. తెలంగాణలో TRSకి బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణలో పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందనీ, తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారనీ... కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశమంతా బీజేపీవైపే చూస్తోందన్న రాజగోపాల్ రెడ్డి... పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ను ఆ పదవి నుంచీ మార్చనందువల్లే కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఆరోపించారు. బీజేపీలో చేరే అంశంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి అప్పగించినా ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవడం బీజేపీకి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇదే ఊపుతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా దృష్టిసారించారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటునట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Published by:Krishna Kumar N
First published:

Tags: Komatireddy rajagopal reddy, Telangana, Telangana updates

ఉత్తమ కథలు