హోమ్ /వార్తలు /national /

కాంగ్రెస్ జోరు... టీజేఎస్‌లో టెన్షన్

కాంగ్రెస్ జోరు... టీజేఎస్‌లో టెన్షన్

కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ మొదలుపెట్టడంతో టీజేఎస్‌లో టెన్షన్ మొదలైంది. తమకు ఇవ్వాల్సిన సీట్ల సంగతి తేల్చుకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంపై ఆ పార్టీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

  నవంబర్ సమీపిస్తుండటంతో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. దాదాపు 42 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. నవంబర్ 2న ఇందుకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహాకూటమిలోని టీజేఎస్(తెలంగాణ జనసమితి)లో టెన్షన్ మొదలైంది. కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌కు సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో భాగంగా టీజేఎస్‌కు పది సీట్లు ఇస్తారని ప్రచారం జరిగింది.

  అయితే తమకు 15 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది. అయితే టీజేఎస్ డిమాండ్‌ను పట్టించుకోకుండానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థుల్లో టీడీపీ డిమాండ్ చేస్తున్న స్థానాలు పెద్దగా లేవనే చెప్పాలి. దీంతో టీడీపీకి కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తగా వ్యవహరించిందనే టాక్ వినిపిస్తోంది. అయితే టీజేఎస్‌కు కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తోందని ప్రచారం సాగుతున్న మల్కాజ్ గిరి, చంద్రాయణగుట్ట, మలక్ పేట్, మెదక్, దుబ్బాక, రామగుండం, వరంగల్ ఈస్ట్, అసిఫాబాద్, చెన్నూరు, ఖానాపూర్ సీట్లపై ఇంకా స్పష్టత రావడం లేదు.

  ఇందులో అసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసిందనే ఊహాగానాలు వస్తుండటంతో... అసలు టీజేఎస్ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఎలా ఉందనే అంశం ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశమైన టీజేఎస్ కోర్ కమిటీ... సీట్ల విషయం తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి మరోసారి అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీజేఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరిని అవలంభిస్తుంది... కాంగ్రెస్ ఇచ్చిన సీట్లతో కోదండరాం పార్టీ కన్విన్స్ అవుతుందా అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

  First published:

  Tags: Congress, Kodandaram, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు