హోమ్ /వార్తలు /national /

ఇదేం వైఖరి... కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరాం

ఇదేం వైఖరి... కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరాం

కోదండరామ్ (ఫైల్ ఫొటో)

కోదండరామ్ (ఫైల్ ఫొటో)

గత 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుట్టారు.

తెలంగాణ ప్రభుత్వంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పోలీస్ శాఖ తప్ప వేరే ఏ ఇతర శాఖలు పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. గత 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించకుండా అక్రమంగా అరెస్టులు చేస్తోందని కోదండరాం మండిపడ్డారు. ఇటువంటి నియంతృత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని, వెంటనే వారితో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా తాను కూడా నిరహార దీక్షకు కూర్చోవాలనే యోచనలో కోదండరాం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ నేతలతో చర్చించిన తరువాత కోదండరాం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి.

First published:

Tags: CM KCR, Kodandaram, TSRTC Strike

ఉత్తమ కథలు