హోమ్ /వార్తలు /national /

సీట్ల సర్దుబాటు... సీపీఐతో కోదండరాం కీలక చర్చలు

సీట్ల సర్దుబాటు... సీపీఐతో కోదండరాం కీలక చర్చలు

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)

ఓ వైపు తమ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉండగా... మహాకూటమిలో టీజేఎస్, సీపీఐ నేతలు చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీపీఐతో తాను మధ్యవర్తిత్వం చేయడానికి రాలేదని కోదండరాం వివరణ ఇచ్చారు.

  తమ పార్టీ తరపుప పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇంకా తాము ఏ ఆలోచన చేయలేదని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కాంగ్రెస్ వాళ్లంతా ఢిల్లీలో ఉన్నారని, వాళ్లతో మాట్లాడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు తమ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉండగా... మహాకూటమిలో టీజేఎస్, సీపీఐ నేతలు చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీపీఐ నేతలతో చర్చించేందుకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం... ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంపై కోదండరాం కీలక చర్చలు జరిపారనే వార్తలు వినిపించాయి.

  అయితే సీపీఐ నేతలతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరాం... సీపీఐతో తాను మధ్యవర్తిత్వం చేయడానికి రాలేదని వివరణ ఇచ్చారు. సీట్ల సర్దుబాటు విషయంలో సీపీఐ ఆలోచన ఏంటో తెలుసుకుందామని వచ్చానని తెలిపారు. తమకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని... సీట్లు విషయంలో స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్థుల గురించి ఆలోచిస్తామని కోదండరాం తెలిపారు. మరోవైపు కూటమి పొత్తుల్లో భాగంగా సీపీఐకు మూడు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లు కేటాయించడంతో... కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన సీపీఐ నేత కూడా ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, CPI, Kodandaram, Mahakutami, Telangana, Telangana Election 2018

  ఉత్తమ కథలు