హోమ్ /వార్తలు /national /

‘హస్తం’పై పోటీ... కోదండరాం తర్జనభర్జన

‘హస్తం’పై పోటీ... కోదండరాం తర్జనభర్జన

మహాకూటమిలోని టీజేఎస్ ఇప్పుడు ధర్మసంకటంలో పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు సీట్ల విషయంలో కోదండరాం పార్టీకి క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్... ఇప్పుడు తమ గుర్తు మీద పోటీ చేయాలని ఆయనకు సూచించిందని తెలుస్తోంది.

  మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాక ఇబ్బందిపడుతున్న టీజేఎస్... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తుందా ? కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోదండరాంకు సూచించిందా ? ఈ అంశంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ సమాజంలో విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న కోదండరాంను వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అయితే అదే సమయంలో ప్రజల్లోకి పెద్దగా వెళ్లని టీజేఎస్ పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తారనే నమ్మకం కూడా కాంగ్రెస్‌కు లేదనే వాదన వినిపిస్తోంది.

  ఈ కారణంగానే తమ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని టీజేఎస్‌ను కాంగ్రెస్ నేతలు కొద్ది రోజులుగా కోరుతున్నారు. అయితే అలా చేయడం వల్ల గెలిచిన వారంతా కాంగ్రెస్ సభ్యులు అవుతారని... అప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతందని ఆ పార్టీ నేతలు వాదించారు. ఈ చర్చ ముగిసిపోయిందని అనుకున్నా... మరోసారి రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని కోదండరాం దగ్గర ప్రస్తావించడంతో... మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

  ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన కోదండరాం
  ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన కోదండరాం

  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారైనా... టీడీపీ, టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటు కారణంగా ఆ జాబితాను కాంగ్రెస్ విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే కోదండరాంతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడానికి ఒప్పుకుంటే ఆయన సూచించిన వారిలో చాలామంది టికెట్ల ఇవ్వడానికి ఓకే చెప్పిందని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్‌తో పోటీ విషయంలో ప్రతి సీటు కీలకమే అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూటమిలో ఎవరూ నష్టపోయినా అంతిమంగా అది టీఆర్ఎస్‌కు లాభిస్తుందని భావిస్తోంది. అదే జరిగితే మహాకూటమి లక్ష్యం నెరవేరదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? ఆయన పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయించేందుకు ఒప్పుకుంటారా ? లేక కాంగ్రెస్ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం రావాల్సి ఉంది.

  First published:

  Tags: Congress, Kodandaram, Rahul Gandhi, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు