హోమ్ /వార్తలు /national /

మహాకూటమిలో కొనసాగుతాం... ప్రచారంలో వెనుకబడ్డాం: కోదండరాం

మహాకూటమిలో కొనసాగుతాం... ప్రచారంలో వెనుకబడ్డాం: కోదండరాం

టీజేఎస్ మహాకూటమిలోనే కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఆలస్యంగా ఏర్పడటం వల్ల పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ గందరగోళం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

    కోరినన్ని సీట్లు ఇస్తేనే మహాకూటమిలో కొనసాగుతామని పట్టుదలగా ఉన్న టీజేఎస్... సీట్ల పంపకం విషయంలో కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది. మహాకూటమి ఏర్పాటుతో రాష్ట్రంలో మార్పు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై మహాకూటమి నేతలు చర్చల జరిపిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తాము మహాకూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేసిన కోదండరాం... టీజేఎస్ కూటమి నుంచి బయటకు వస్తుందన్న ఊహాగానాలకు చెక్ చెప్పారు.

    తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే మహాకూటమి ఏర్పాటైందని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నా... కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోందని కోదండరాం అన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యం కావడంతో పార్టీల శ్రేణులతో పాటు ప్రజల్లోనూ గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమే అని కోదండరాం అంగీకరించారు. మహాకూటమి అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలతో పాటు టీ టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    First published:

    Tags: Congress, Kodandaram, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi, Trs

    ఉత్తమ కథలు