హోమ్ /వార్తలు /national /

ఉత్తమ్‌తో భేటీ కానున్న కోదండరాం, చాడ

ఉత్తమ్‌తో భేటీ కానున్న కోదండరాం, చాడ

సీట్ల సర్దుబాటు అంశంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి చర్చించబోతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ఉత్తమ్ ఈ భేటీలో వారికి వివరించబోతున్నట్టు తెలుస్తోంది.

    సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. నిన్న జానారెడ్డితో భేటీ అయిన సీపీఐ నేతలు... కాంగ్రెస్ ప్రతిపాదిత మూడు సీట్లు తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తమకు కావాల్సిన సీట్లను కేటాయించాలని కోరారు. అయితే ఈ అంశంపై ఉత్తమ్‌తో చర్చించాలని జానారెడ్డి వారికి సూచించారు. దీంతో ఈ రోజు ఉత్తమ్‌ను కలిసి ఇదే అంశంపై చర్చించబోతున్నారు సీపీఐ నేతలు.

    మరోవైపు కోదండరాం కూడా ఉత్తమ్‌ను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపబోతున్నారు. టీజేఎస్‌కు కేటాయించిన సీట్లపై స్పష్టతతో పాటు జనగామ సీటు విషయమై ఆయన ఉత్తమ్‌తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మిత్రపక్షాలతో చర్చలు పూర్తి చేసిన తరువాత తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ... ఈ క్రమంలోనే మిత్రపక్షాల నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు... అందుకు గల కారణాలు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోదండరాం, సీపీఐ నేతలకు వివరించే అవకాశం ఉంది. ఉత్తమ్‌తో భేటీ తరువాత సీపీఐ పార్టీ తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    First published:

    Tags: Congress, CPI, Kodandaram, Telangana, Telangana Election 2018, Uttam Kumar Reddy

    ఉత్తమ కథలు