హోమ్ /వార్తలు /national /

Kodali Nani: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్, ఆ పని చేయలేకపోతే 2024లో పోటీ చేయనంటూ...

Kodali Nani: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్, ఆ పని చేయలేకపోతే 2024లో పోటీ చేయనంటూ...

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

  ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు 2 లక్షల ఇళ్లు కూడా కట్టలేకపోయారని, వైసీపీ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఇల్లు నా సొంతం’ పేరుతో టీడీపీ నేతలు నిరసనలు చేయడాన్ని కొడాలి నాని తప్పుపట్టారు. ఓడిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు రోడ్లెక్కి షో చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ వచ్చి ఒక్క ఇల్లు అయినా ఇచ్చి చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు వర్గం ఎన్ని కుట్రలు పన్నినా 2024లోపు గుడివాడలో 25వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి తీరతామని కొడాలి నాని స్పష్టం చేశారు.

  ‘గుడివాడ నియోజకవర్గంలో 25వేల మంది పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. కోర్టులు అంగీకరిస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తాం. లేకపోతే పట్టా ఇస్తాం. 2024 ఎన్నికల లోపు ఇచ్చే బాధ్యత వైఎస్ జగన్‌ది, మాది. ఒకవేళ చంద్రబాబు లాంటి వాళ్లు అడ్డుపడితే జగన్నాథ రథచక్రాల కింద నల్లుల్లా నలిపేస్తాం. 2024లోపు 25వేల ఇళ్లు ఇవ్వలేకపోతే నేను ఓట్లు అడగడానికి రాను. పోటీ కూడా చేయను.’ అని కొడాలి నాని ప్రతిజ్ఞ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 20వేల మంది పేదలకు ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఇస్తే 2024లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఆ భయంతోనే చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టుకు వెళ్లి 30 లక్షల ఇళ్ల కేటాయింపును అడ్డుకుంటూ స్టేలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Gudivada, Housing lands for poor, Kodali Nani

  ఉత్తమ కథలు