హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నల్లకాకి ఆసనాలు అంటూ ట్వీట్... జాత్యహంకార వ్యాఖ్యల దుమారంలో కిరణ్ బేడీ..

నల్లకాకి ఆసనాలు అంటూ ట్వీట్... జాత్యహంకార వ్యాఖ్యల దుమారంలో కిరణ్ బేడీ..

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి మీద పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, అందుకు క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి మీద పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, అందుకు క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి మీద పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, అందుకు క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.

  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గత బుధవారం నుంచి రాజ్‌‌నివాస్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ రోజువారీ విధుల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ జోక్యం పెరిగిపోతోందని, ప్రతిదాంట్లోనూ ఆమె వేలు పెడుతున్నారంటూ సీఎంతో పాటు పుదుచ్చేరి కేబినెట్ మొత్తం రాజ్‌నివాస్ ఎదుట నిరసన తెలుపుతున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశంలోని విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వాళ్లు నారాయణస్వామికి మద్దతుగా నిలిచారు.

  Kiran Bedi, Kiran Bedi Tweet, Puducherry Lieutenant Governer, Kiran Bedi Vs Narayanasamy, Puducherry CM Narayanasamy, Kiran Bedi Crow Yoga, Kiran Bedi Racism Tweets, Racism tweets by Kiran Bedi, కిరణ్ బేడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కిరణ్ బేడీ ట్వీట్స్, నల్లకాకి ఆసనాలు ట్వీట్, కిరణ్ బేడీ వర్సెస్ నారాయణస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, పుదుచ్చేరి రాజ్‌నివాస్, నారాయణస్వామి ధర్నా
  మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలతో కలసి రాజ్ నివాస్ ఎదుట ధర్నా చేస్తున్న సీఎం నారాయణస్వామి (Image:Twitter)

  సోమవారం ఉదయం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేసిన ఓ ట్వీట్ పెను దుమారానికి దారి తీసింది. ఓ చెట్టు మీద రెండు కాకులు ఉన్న ఫొటోను తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్‌లో కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఆ ఫొటోకు ‘యోగా విశ్వవ్యాప్తం’ అని క్యాప్షన్ పెట్టారు.

  కిరణ్ బేడీ ట్వీట్..

  అయితే, అసలు దాని ఉద్దేశం ఏమై ఉంటుందా అని చాలామంది తలబద్ధలు కొట్టుకున్నారు. అలాంటి వారి కోసమే అన్నట్టుగా కిరణ్ బేడీ మరో ట్వీట్ చేశారు. మళ్లీ ఆ రెండు కాకులు చెట్టుమీద ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. దానికి ‘ఓ మీడియా వ్యక్తి ధర్నా చేయడం కూడా యోగానేనా అని అడిగారు. నేను ఔనని చెప్పా. వాళ్లు ఎందుకు కూర్చున్నారనే విషయం మీదే అది ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఆసనాలు వేస్తున్నారు? ఎలాంటి సౌండ్స్ చేస్తున్నారు? అనేదాన్ని బట్టే ఉంటుంది.’ అని వివరంగా చెప్పారు.

  కిరణ్ బేడీ రెండో ట్వీట్..

  కిరణ్ బేడీ చేసిన మొదటి ట్వీట్ కంటే రెండో ట్వీట్ పెను దుమారం రేపింది. ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఉద్దేశించే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. పుదుచ్చేరి సీఎం మీద జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కిరణ్ బేడీ ఆయనకు క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.

  కిరణ్ బేడీపై కనిమొళి ట్వీట్

  నెటిజన్లు కూడా కిరణ్ బేడీ తీరు మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

  ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కిరణ్ బేడీ.. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామితో పాటు కేబినెట్ మంత్రులను కూడా చర్చలకు పిలిచారు.

  First published:

  Tags: Kiran Bedi, Narayana Swamy, Puducherry

  ఉత్తమ కథలు