Kick Me Out If I Dont..Kejriwal On Schools: ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ గుజరాత్ పేపర్ లీక్ లో బీజీపీ ప్రపంచ రికార్డు సృష్టిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన గుజరాత్ లోని భరూచ్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు.. ప్రస్తుతం గుజరాత్ లో పాఠశాలల పరిస్థితి అధ్వన్నంగా మారిందన్నారు. అక్కడ.. 6000 ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. దీంతో లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజ్ లేకుండా కనీసం ఒక పరీక్ష నిర్వహించగలరా అంటూ భూపేంద్ర పటేల్ కు సవాల్ విసిరారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిన గుజరాత్ ను, ఇక్కడి పాఠశాలలను తాము ఢిల్లీ మోడల్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అదే విధంగా.. ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ అవకాశంలో తాము.. పాఠశాలలను మెరుగుపరచకపోతే మీరు నన్ను తరిమికొట్టవచ్చు" అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం.. 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలకు మారారని అన్నారు.
ఢిల్లీలో, ధనవంతులు, పేదల పిల్లలు కలిసి చదువుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈసారి 99.7% ఉత్తీర్ణత నమోదైందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో అధికారం సాధించిన తర్వాత మరింత జోష్ ఉన్నారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ 27 సంవత్సరాలుగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 27 గిరిజన ప్రాబల్య స్థానాల్లో 15 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 58 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆప్ చేపట్టిన రహస్య సర్వేలో తెలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, EDUCATION, Gujarat