హోమ్ /వార్తలు /national /

ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారు?.. వైకాపాపై కేశినేని నాని ఫైర్

ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారు?.. వైకాపాపై కేశినేని నాని ఫైర్

కేశినేని నాని(ఫైల్ ఫొటో)

కేశినేని నాని(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి భూ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని గురువారం ఢిల్లీలో వైకాపా ఎంపీలు ధర్నా చేయడంపై కేశినేని పలు ప్రశ్నలు సంధించారు

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి భూ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని గురువారం ఢిల్లీలో వైకాపా ఎంపీలు ధర్నా చేయడంపై కేశినేని పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరితే కేంద్రం అమోదిస్తుందని.. అలాంటప్పుడు ఎంపీలు ధర్నాలు చేయడమెందుకుని మండిపడ్డారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఎప్పుడు పోరాడుతారని కేశినేని నాని ప్రశ్నించారు.

  ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఎప్పుడు పోరాడతారో చెప్పాలని సీఎం జగన్‌ను ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేశినేని నాని ట్విటర్‌లో పోస్టులు పెట్టారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వైసీపీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని కేశినేని నాని అన్నారు. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేసే వ్యక్తులు.. సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ కేసులు త్వరగా విచారణ జరిగిలే సహకరించవచ్చు కదా అని వ్యంగ్యస్రాలు సంధించారు.

  ఇక, టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాలు జరిగాయని వైకాపా నేతలు ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలని వైకాపా ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ధర్నా చేపట్టారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: AP Politics, Kesineni Nani, Ysrcp

  ఉత్తమ కథలు