హోమ్ /వార్తలు /national /

కేశినేని నానికి కీలక పదవి... ఏం జరుగుతోంది...

కేశినేని నానికి కీలక పదవి... ఏం జరుగుతోంది...

విజయవాడ ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)

విజయవాడ ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)

2014లో తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని... 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు.

టీడీపీ ఎంపీకి కేశినేని నానికి కేంద్ర ప్రభుత్వం కీలక కమిటీలో చోటు కల్పించింది. ఆయనను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా కేంద్రం ఎంపిక చేసింది. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు, వాటికి సంబంధించిన నిబంధనలు, హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలను కూడా ఈ కమిటీ రివ్యూ చేయనుంది. ఇప్పటికే పలు కమిటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన అధికార, విపక్ష సభ్యులు పలు కమిటీల్లో సభ్యులుగా ఎంపిక కాగా... తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో చోటు దక్కింది.

2014లో తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని... 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. రెండోసారి ఎంపీగా గెలిచిన తరువాత పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొన్నాళ్ల పాటు అలక వహించిన కేశినేని నాని... అప్పట్లో పార్టీ మారతారనే వార్తలు కూడా వినిపించాయి. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. అయితే కేశినేని నాని మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు కేశినేని నానికి కేంద్రంలో కీలక పదవి దక్కడంతో... బీజేపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందనే ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి.

First published:

Tags: Kesineni Nani, TDP

ఉత్తమ కథలు