హోమ్ /వార్తలు /national /

ఆ ఇద్దరు ఏపీ ఎంపీలకు కీలక పదవులు ఇచ్చిన కేంద్రం..

ఆ ఇద్దరు ఏపీ ఎంపీలకు కీలక పదవులు ఇచ్చిన కేంద్రం..

లోక్‌సభ

లోక్‌సభ

ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 29 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. ఇద్దరు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులకు కీలక పదవులు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్‌లో ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. వైసీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది.ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 29 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. ఇద్దరు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.కేంద్ర వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలించి,వ్యయంలో పొదుపు చర్యల కోసం ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీ కొనసాగుతుంది.

కాగా, ఇప్పటి వరకు కేంద్రం ఆఫర్ చేసిన పదవులను వైసీపీ తిరస్కరిస్తూ వస్తోంది. కీలకమైన డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం ప్రత్యేక హోదా కోసం వదులుకుంది. అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్యానల్ లోక్ సభ స్పీకర్ గా నియమించింది. ఆ నియామకాన్ని వైసీపీ స్వాగతించింది. ఇప్పటికే మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్‌గా భాధ్యతలు సైతం నిర్వర్తించారు. తాజాగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నియమించడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

First published:

Tags: 17th Lok Sabha, Kesineni Nani, Magunta srinivasulu reddy

ఉత్తమ కథలు