హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kejriwal : గుజరాత్ లో ఆప్ విజయానికి కేజ్రీవాల్ మాస్టర్ స్కెచ్..మామూలుగా లేదుగా

Kejriwal : గుజరాత్ లో ఆప్ విజయానికి కేజ్రీవాల్ మాస్టర్ స్కెచ్..మామూలుగా లేదుగా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

Kejriwal Focus On Gujarat : ఢిల్లీ(Delhi)లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)ఫోకస్ పెట్టింది. కొద్ది నెలల క్రితం పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆప్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Kejriwal Suggestion BJP Workers : ఢిల్లీ(Delhi)లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)ఫోకస్ పెట్టింది. కొద్ది నెలల క్రితం పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆప్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. పంజాబ్ లో ఘన విజయం సాధించిన ఆప్.. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat Assembly Elections) కూడా విజయం సాధించి అధికారం చేపట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పలుసార్లు కేజ్రీవాల్ సహా ఆప్ ముఖ్యనేతలు తరచూ గుజరాత్ లో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపడమే కాకుండా గుజరాత్ లోని అన్ని వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకునేలా హామీలు గుప్పిస్తున్నారు. గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో మాదిరి గుజరాత్ లో మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ లు ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రజలకు హామీనిస్తున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రజలకు గ్యారెంటి ఇస్తామని, ఉచితంగా వీటిని ప్రజలు పొందే విధంగా తాము చూస్తామన్నారు.

అయితే ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో ఉండి, ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేయండి అని గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా రెండవ రోజు రాజ్‭కోట్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.... త‌మ‌కు బీజేపీ నేత‌లు అవ‌స‌రం లేద‌ని, ఆ పార్టీ ప‌న్నా ప్ర‌ముఖులు, గ్రామాలు, బూత్‌లు, తాలూకా స్ధాయి కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీలో చేరుతున్నార‌ని చెప్పారు. బీజేపీకి ఏళ్లుగా సేవ‌లందిస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ తిరిగి ఏమిచ్చింద‌ని ప్ర‌శ్నించారు. తమ పార్టీలోకి బీజేపీ నుంచి చాలా ఎక్కువగా వచ్చేవారు ఉన్నప్పటికీ వారిని బీజేపీ నేతలు ఆపుతున్నారు. ఆప్‭లోకి రావాలనుకుని రాలేకపోతున్న బీజేపీ కార్యకర్తలుకు తాను ఓ విషయం చెప్పదల్చుకున్నానని.. బీజేపీలోనే ఉండి, వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకొని కానీ ఆప్ కోసం పని చేయాలని, ఎందుకంటే ఇవ్వడానికి తమ దగ్గర డబ్బు లేదు అని కేజ్రీవాల్ అన్నారు. గుజ‌రాత్‌లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్య‌, వైద్యం, ఉచిత విద్యుత్ అంద‌చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు.

దెబ్బ అదుర్స్ కదూ : బ్రిటన్ ను వెనక్కి నెట్టేసి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

ప్రజలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన వీటిని తాము ఇస్తుంటే అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని కేజ్రీవాల్ ధీమా వ్య‌క్తం చేశారు. ఓడిపోతామ‌ని తెలిస్తే చాలు బీజేపీ కుట్ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని కేజ్రీవాల్ మండిప‌డ్డారు. ఆప్ నాయ‌కుడు మ‌నోజ్ సోర‌థియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. మ‌నోజ్‌పై బీజేపీ గుండాలు దాడి చేయ‌డంతో గుజ‌రాత్‌లోని ఆరు కోట్ల మంది ప్ర‌జ‌లు మోదీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఓ నాయ‌కుడిపై దాడి చేయ‌డం ఈ దేశం సంస్కృతి కాదు... అంత‌కంటే హిందూ సంస్కృతి కాదు... అస‌లు గుజ‌రాత్ క‌ల్చ‌ర్ కానే కాద‌ని కేజ్రీవాల్ తెలిపారు. మ‌నోజ్‌పై దాడి చేయ‌డాన్ని సూర‌త్ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు.

వీడెవడండీ బాబు : KGF చూసి ఫేమస్ అయ్యేందుకు 4గురిని హత్య చేశాడు

కాగా, గుజరాత్ కు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ గుజరాత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దఫా అధికారం తమదేనన్న ధీమాతో ఉండగా.. బీజేపీని ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ , ఆప్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, Aravind Kejriwal, Bjp, Gujarat, Kejriwal

ఉత్తమ కథలు