హోమ్ /వార్తలు /national /

చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ వరం...

చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ వరం...

సమ్మె సమయంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం లేదా ఆర్టీసీలోనే వారి అర్హతలకు తగిన ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో సుమారు 29 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ తర్వాత విధులకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కార్మికులు విధులకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ భరోసా కల్పించే నిర్ణయం తీసుకున్నారు. సమ్మె సమయంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం లేదా ఆర్టీసీలోనే వారి అర్హతలకు తగిన ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, కార్మికులు చనిపోవడానికి, దాదాపు రెండు నెలల పాటు జీతాలు లేకుండా, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని భయపడే స్థితికి చేరుకోవడానికి ఆర్టీసీ యూనియన్లే కారణమని కేసీఆర్ స్పష్టం చేశారు.

    First published:

    Tags: CM KCR, TSRTC Strike

    ఉత్తమ కథలు