హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BRS| Maharashtra: మహారాష్ట్రలో ఒక్కసారి బీఆర్ఎస్‌ని గెలిపించండి..బీజేపీ ఎలా దిగొస్తుందో చూడండి: KCR

BRS| Maharashtra: మహారాష్ట్రలో ఒక్కసారి బీఆర్ఎస్‌ని గెలిపించండి..బీజేపీ ఎలా దిగొస్తుందో చూడండి: KCR

kcr sabha

kcr sabha

BRS MEETING:75ఏళ్ల బీజేపీ, కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదన్నారు బీఆర్ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్. మహారాష్ట్రలో బీజేపీ పాలకులు ఎందుకు రైతులకు తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nanded, India

దేశంలో ఇప్పటి వరకు 75ఏళ్ల కాలం పాలించిన కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పాలకుల వల్ల రైతుల జీవితాలు ఏమాత్రం మారలేదన్నారు బీఆర్ఎస్‌ (BRS)పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ (KCR)అన్నారు. మహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్ జిల్లా కాందార్ లోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ తెలంగాణలో రైతు బంధు, రైతు భీమా, దళిత బంధువు, దళిత భీమా వంటి అధ్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహారాష్ట్రలో అలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ పాలకుల్ని ప్రశ్నించారు. మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌(Fadnavis) తనకు మహారాష్ట్రలో ఏం పని అంటూ కామెంట్స్ చేశారని చెప్పారు కేసీఆర్. ఆయన్ని ఉద్దేశించి మీరు తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇస్తే తాను మహారాష్ట్రకు వచ్చే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేశారు. 54ఏళ్ల పాటు కాంగ్రెస్ 21సంవత్సరాలు బీజేపీ పాలించినా దేశ ప్రజలు, రైతుల తలరాతలు మాత్రం మారలేదన్నారు. రాజనీతి చెప్పడానికి తాను మహారాష్ట్రకు రాలేదని ..కేవలం దేశ పౌరుడిగా తాను ప్రతి రాష్ట్రానికి వెళ్తానని చెప్పారు. అంతకు ముందు మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. అబ్‌ కీ బార్ కిసాన్‌ కే సర్కారు నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన బీఆర్ఎస్‌ అందుకు అనుగూణంగానే ప్రతి రాష్ట్రంలోని రైతులకు సాగుకు సరిపడ నీరు, విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్‌ నాందేడ్‌ సభ తర్వాత మహరాష్ట్ర రైతులకు బీజేపీ ప్రభుత్వం 6వేలు సాగు సాయం అందజేసిందని...తమ డిమాండ్ 6వేలు కాదని ఎకరానికి 10వేలు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఎకరాకు 10వేలు ఇవ్వాలి..

మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించాలని కేసీఆర్ లోహ సభ వేదికపై పిలుపునిచ్చారు. ప్రతి చోట గులాబీ జెండా ఎగుర వేయాలని ..అలాంటి తీర్పు ప్రజలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుందని ..వాళ్లు ఎకరాకు 6వేలు ఇవ్వడం కాదు..10వేలు ఇస్తారంటూ చెప్పారు. తెలంగాణలో 8ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రజల కంటే దయనీయంగా పరిస్థితులు ఉండేవని..కాని టీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్, సాగునీరు వంటి పెద్ద సమస్యల్ని పరిష్కరించుకున్నామని చెప్పారు.

పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిపించాలి..

దేశం అభివృద్ధి పధంలో ముందుకు వెళ్తుందో..వెనక్కి వెళ్తుందో అర్ధం చేసుకోవాలని సూచించారు. ఫసల్ భీమా యోజన పథకం ద్వారా మహారాష్ట్రలో ఎవరైనా లబ్ది పొందారా అని ప్రజలను ప్రశ్నించారు కేసీఆర్. అంతే కాదు నాందెడ్‌ ఎయిర్‌పోర్ట్‌ 24గంటలు తెరిచి ఉంచాల్సింది సాయంత్రం 6గంటలకు మూసివేస్తామని అధికారులు చెప్పారు. అంటే ఎలాంటి పాలన ఉందో అర్ధం చేసుకోమన్నారు.తెలంగాణ తరహాలోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారాలంటే తప్పని సరిగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి బీఆర్ఎస్‌ని గెలిపించాలని సూచించారు.

First published:

Tags: BRS, CM KCR, Maharashtra, National News

ఉత్తమ కథలు