ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత కవిత మళ్లీ ఎప్పుడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారతారనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు కవిత విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారనే అంశం కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కవిత పార్టీ కార్యాలయంలో చర్చలు జరపడం టీఆర్ఎస్ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. పార్టీ వ్యవహారాలపై సమీక్షలు నిర్వహిస్తున్న కేటీఆర్‌తో కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చర్చించారు. ఉన్నట్టుండి కవిత కేటీఆర్‌తో చర్చలు జరపడంతో... ఆమె మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ కాబోతున్నారనే చర్చ టీఆర్ఎస్లో మొదలైంది.
కేబినెట్ విస్తరణలో కేటీఆర్‌కు చోటు మంత్రి పదవి దక్కుతుందని... కవిత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కవిత పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కవితకు ఇతర కీలకమైన బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా అనే చర్చ కూడా టీఆర్ఎస్లో కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న టీఆర్ఎస్... సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కవిత కూడా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను తీసుకుంటారేమో అనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, KTR, Nizamabad, Trs