ఇటు అన్న.. అటు అమ్మ..మధ్యలో కలైంజర్ ..!

 • News18 Telugu
 • | August 08, 2018, 19:19 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 4 YEARS AGO

  AUTO-REFRESH

  19:24 (IST)

  కలైంజర్‌ను సమాధి చేసే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

  19:20 (IST)

  మెరీనా తీరంలో కలైంజర్ కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. అన్న(అన్నాదురై), అమ్మ(జయలలిత) మెమోరియల్స్ మధ్య కలైంజర్ సమాధి అయ్యారు. తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కలైంజర్ సమాధి చేసే సమయంలో అభిమానులు గుండెలు పగిలేలా రోదించారు. ఇక కరుణానిధి కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య తుది విడ్కోలు పలికారు.

  18:17 (IST)

  కరుణానిధి అంతిమయాత్ర మెరీనా బీచ్‌కు చేరుకుంది. చెన్నై సముద్ర తీరం శోక సంద్రంగా మారింది. తమ అభిమాన నేత సమాధి అవుతున్నారని తెలిసి.. అభిమానులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

  18:4 (IST)

  కలైంజర్ కరుణానిధి వినియోగించిన చక్రాల కుర్చీ ఇదే.


  17:52 (IST)

  రాజాజి హాల్ నుంచి మెరీనా బీచ్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఐతే కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు లక్షలాదిగా తరలిరావడంతో అంతిమయాత్ర నెమ్మదిగా ముందుకు సాగుతోంది.

  17:49 (IST)

  కలైంజర్ కరుణానిధి గౌరవార్థం పుదుచ్చేరిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి తెలిపారు.

  17:38 (IST)

  కరుణానిధి శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త అని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. 

  17:32 (IST)

  అంతిమయాత్రలో కరుణానిధి పార్థివదేహం వద్ద స్టాలిన్, అళగిరి, దయానిధి మారన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలు ఉన్నారు.  లక్షలాది మంది కలైంజర్ అభిమానులు అంతిమయాత్ర వాహనాన్ని అనుసరిస్తున్నారు.

  17:22 (IST)

  కరుణానిధికి DMK  పార్టీ కార్యకర్తలు ఘన నివాళి అర్పిస్తున్నారు. కలైంజర్ ఫొటోలతో తయారు చేసిన 100 మీటర్ల పొడవైన బ్యానర్‌ను అంతిమయాత్రలో ప్రదర్శించారు అభిమానులు.


  17:19 (IST)

  రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు పార్టీల నేతలు చెన్నైకి వచ్చి కరుణానిధికి నివాళి అర్పించారు.

  తమిళ సూరీడు శాశ్వతంగా అస్తమించాడు. మెరీనా తీరంలో అన్న, అమ్మ మెమోరియల్స్ మధ్య కలైంజర్ సమాధి అయ్యారు. తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కలైంజర్ సమాధి చేసే సమయంలో అభిమానులు గుండెలు పగిలేలా రోదించారు. దాంతో చెన్నై సముద్ర తీరం శోక సంద్రంగా మారింది.  మెరీనా బీచ్‌కు వెళ్లే రోడ్లు ఇసుకేస్తే రాలనంతంగా జనంతో కిక్కిరిసిపోయాయి. అశ్రునయనాల మధ్య తమ అభిమాన నేతలకు కడసారి వీడ్కోలు పలికారు అభిమానులు.