శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కర్ణాటకలో అధికార పార్టీ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ఆయన తన ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గురువారమే బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి స్పీకర్ రమేష్ కుమార్‌కు ఆదేశాలు వచ్చాయి. అయినా సరే నిన్న సభలో బలపరీక్ష జరగలేదు. సభ నేటి ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ వాజుభాయ్ వాలా సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. నేటి మధ్యాహ్నం 1.30 లోపు బలపరీక్ష నిర్వహించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress-jds, Hd kumaraswamy, Karnataka bjp, Karnataka political crisis, Siddaramaiah, Yeddyurappa