హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Karnataka Floor Test | కుమారస్వామి బలపరీక్షలో సిద్ధరామయ్య కొత్త ట్విస్ట్

Karnataka Floor Test | కుమారస్వామి బలపరీక్షలో సిద్ధరామయ్య కొత్త ట్విస్ట్

Karnataka Trust Vote | ‘సభలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది. వారు మాట్లాడడం పూర్తి కావడానికి సమయం పడుతుంది. సోమవారం కూడా కొనసాగొచ్చు.’ అని సిద్ధరామయ్య అన్నారు.

  కర్ణాటకలో బలపరీక్ష ‘నాటకం’ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలలోపు సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటూ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా సీఎం కుమారస్వామికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అయినా, ఇప్పటి వరకు సభలో ఎలాంటి బలపరీక్ష జరగలేదు. చర్చ ముగిసేంత వరకు ఓటింగ్ జరగదంటూ స్పీకర్ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య మరో బాంబు పేల్చారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు బలపరీక్ష జరిగే అవకాశం లేదని చెప్పారు. ‘సభలో చర్చ ఇంకా ముగియలేదు. ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది. వారు మాట్లాడడం పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈ రోజు అది పూర్తవుతుందన్న గ్యారెంటీ లేదు. సోమవారం కూడా కొనసాగొచ్చు.’ అని సిద్ధరామయ్య అన్నారు. దీంతో ఇవాళ సభలో కుమారస్వామికి బలపరీక్ష లేనట్టేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

  అంతకు ముందు బీజేపీ సభ్యులు సభలో నిరసన తెలిపారు. గవర్నర్ ఇచ్చిన గడువు మధ్యాహ్నం 1.30లోపు బలపరీక్ష నిర్వహించాలని, ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ధిక్కరిస్తోందంటూ ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

  First published:

  Tags: Congress-jds, Hd kumaraswamy, Karnataka bjp, Karnataka political crisis, Siddaramaiah

  ఉత్తమ కథలు