హోమ్ /వార్తలు /జాతీయం /

కర్ణాటక రాజకీయ సంక్షోభం : సాయంత్రం స్పీకర్ ముందుకు రెబల్ ఎమ్మెల్యేలు..

కర్ణాటక రాజకీయ సంక్షోభం : సాయంత్రం స్పీకర్ ముందుకు రెబల్ ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..

సుప్రీం ఆదేశాలతో రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబై నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

  కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ సాయంత్రం 6 గంటల లోపు వారందరు స్పీకర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేలందరితో ఒకేసారి మాట్లాడాలని స్పీకర్‌ను కోరింది. ఆ తర్వాతి పరిణామాలు, వాటి వివరాలను మరుసటి రోజు సుప్రీంకోర్టుకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేత్రత్వంలోని  సుప్రీం బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది.

  సుప్రీం ఆదేశాలతో రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబై నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదిస్తే కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి తెరపడినట్టే. మరోవైపు అటు కుమారస్వామి కూడా కేబినెట్‌ను సమావేశపరిచి.. పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో  ఉన్నారు. గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.స్పీకర్ రమేష్ కుమార్ తమ రాజీనామాలను ఆమోదించడం లేదని రెబల్ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. రాజీనామాలపై స్పీకర్ తాత్సారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం రాజీనామాలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Congress-jds, Jds, Karnataka political crisis, Kumaraswamy

  ఉత్తమ కథలు