హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా..

కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా..

Karnataka ByPoll | కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

    కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా 17 మంది ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. వారిని ఈ అసెంబ్లీ కాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేశారు. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉన్నందున అది పూర్తయ్యే వరకు తాము 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించబోమంటూ సీఈసీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వాస్తవానికి అక్టోబర్ 21న అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ మీద తాము పూర్తిగా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అలా అయితే, తాము కూడా ఉప ఎన్నికలను వాయిదా వేస్తామని ఈసీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఉప ఎన్నికలువాయిదా వేస్తే తమకు అభ్యంతరం లేదని అనర్హత వేటు పడిన వారు, కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర కక్షిదారుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

    First published:

    Tags: Karnataka political crisis, Karnataka Politics

    ఉత్తమ కథలు