హోమ్ /వార్తలు /national /

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్ పట్టణ పరిధిలోని వార్డులకు జనవరి 24న ఎన్నికలు నిర్వహిస్తారు. జనవరి 27న ఫలితాలను ప్రకటిస్తారు. శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

  కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు లైన్ క్లియర్ చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కరీంనగర్ పట్టణ పరిధిలోని వార్డులకు జనవరి 24న ఎన్నికలు నిర్వహిస్తారు. జనవరి 27న ఫలితాలను ప్రకటిస్తారు. శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. కరీంనగర్ మినహా మిగతా చోట్ల జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి.

  కరీంనగర్ ఎన్నికల ముఖ్యమైన తేదీలు:

  జనవరి 10 నుంచి 12 వరకు నామినేషన్ స్వీకరణ

  జనవరి 13: నామినేషన్ల పరిశీలన

  జనవరి 14,15: తిరస్కరణకు గురైన నామినేషనన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం

  జనవరి 16: నామినేషన్ల ఉపసంహరణ గడువు

  జనవరి 24: ఎన్నికల పోలింగ్

  జనవరి 27: ఫలితాల ప్రకటన

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karimangar, Telangana Municipal Elections 2020