హోమ్ /వార్తలు /national /

YS Jagan: వైసీపీలోని ఆ నేతలకు కొత్త టెన్షన్.. సీన్ ఎవరికీ అర్థంకావడం లేదా ?

YS Jagan: వైసీపీలోని ఆ నేతలకు కొత్త టెన్షన్.. సీన్ ఎవరికీ అర్థంకావడం లేదా ?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

Andhra Pradesh: కాపు నేతలు జనసేనకు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారా లేక మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారా ? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఎదుర్కోవడం ఎలా అని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. వైసీపీని గద్దె దించి అధికారం చేజిక్కించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొందరు కాపు నేతలు రహస్యంగా సమావేశమై... రాజకీయ శక్తిగా ఎదగడం ఎలా అనే దానిపై చర్చలు జరపడం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. అసలు ఉన్నట్టుండి కాపులంతా ఈ రకమైన భేటీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారనే చర్చ ఓ వైపు సాగుతుంటే.. అసలు ఈ భేటీ వెనుక ఎవరున్నారనే దానిపై కూడా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ భేటీలో పాల్గొన్న కాపు నేతల్లో అన్ని పార్టీల వాళ్లు ఉండటంతో.. అసలు ఈ భేటీ వెనుక ఏ పార్టీ ఉందనే విషయం కూడా ఎవరికీ అర్థంకావడం లేదు. కాపు నేతలు జనసేనకు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారా లేక మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారా ? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.

ఇదిలా ఉంటే కాపు నేతల భేటీలో పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీకి అనుబంధంగా ఉండే నేతలు కూడా పాల్గొన్నప్పటికీ.. భవిష్యత్తులో వైసీపీలో కొనసాగుతున్న కాపు నేతలకు ఆ సామాజికవర్గం నేతలు ప్రాధాన్యత ఇస్తారా ? లేదా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి కాపు నేతలు కమ్మ, రెడ్ల తరహాలో రాజ్యాధికారం కోసం ప్రయత్నించడం కొత్తేమీ కాదు. అయితే ఈ వర్గానికి చెందిన నేతలు అన్ని పార్టీల్లోనూ ఉండటం.. చిరంజీవి నాయకత్వం వహించిన ప్రజారాజ్యం పార్టీ సక్సెస్ కాకపోవడంతో ఆ వర్గం నేతలు మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

ఇక పవన్ కళ్యాణ్ తాను కాపు వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిని కాదని.. తనను అలా పరిమితం చేయొద్దని పదే పదే విజ్ఞప్తి చేశారు. దీంతో గత ఎన్నికల్లో కాపులందరూ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన వెంట నడిచారా ? అనే అంశంలోనూ క్లారిటీ లేకుండాపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే.. తమ పార్టీకి దూరమైన కాపు వర్గం ఓట్లను మళ్లీ సొంతం చేసుకోవాలనే భావనలో టీడీపీ ఉందని వార్తలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంలో భాగంగా కాపు నేతల సమావేశం జరిగి ఉండొచ్చని వైసీపీ వర్గాలు భావించాయి.

Nara Lokesh: నారా లోకేశ్ కోసం ఆ టీడీపీ నేత వేరే జిల్లాకు వెళ్లిపోతున్నారా ?

MLA Roja: రోజా ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా ?.. భారమంతా ఆయన మీదే..

మరోవైపు కాపులు టీడీపీకి మళ్లీ దగ్గర కాకుండా ఉండేందుకు వైసీపీ ఈ రకమైన రాజకీయ ఎత్తుగడ వేసిందేమో అని టీడీపీలోనూ చర్చ నడుస్తోంది. మరోవైపు ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలంటే జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణంగా మద్దతు తెలపాలనే యోచనలో కాపు నేతలు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఏది వాస్తవమో తెలియదు కానీ.. ప్రస్తుతం అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలకు మాత్రం ఈ అంశంలో కొత్త టెన్షన్ పట్టుకుందనే చర్చ సాగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ysrcp

ఉత్తమ కథలు