2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీని తరిమికొట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. టీడీపీ.. ఓ డ్రామా పార్టీ అంటూ విమర్శించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడి ప్రమాణస్వీకారం కార్యక్రమ విజయవాడలో జరిగింది. ఈ వేడుకకు హాజరైన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అన్ని రంగాల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం అయిపోయిందన్నారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదని విమర్శించారు. డబ్బుతో ఏదైనా కొనుగోలు చేయవచ్చన్న ధీమాలో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి పార్టీలు ఏపీకి అవసరం లేదని, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఫలానాది కావాలని టీడీపీ ఎప్పుడూ అడగలేదని కన్నా లక్ష్మీనారాయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నాలుగు యూనివర్సిటీలను ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ఎక్కడా చెప్పలేదని, దాని వల్ల కలిగే లాభాలను మాత్రమే నెల్లూరు సభలో ప్రస్తావించారని గుర్తుచేశారు. దాంతో ఎగిరిగంతేసిన చంద్రబాబు.. ఆ తర్వాత వెంకయ్యనాయుడికి విజయవాడలో ఘనసన్మానం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, 140కి పైగా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Bjp-tdp, Kanna