కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి కేసుల వ్యవహారంలో ఒత్తిడి పెరిగింది. తాజాగా లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేతకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిస్తే ..ఇప్పుడు జార్ఖాండ్(Jharkhand)లోని న్యాయస్థానాలు రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేశాయి. ఒకటి రెండు కాదు మూడు కేసుల్లో విచారణకు హాజరవ్వాలంటూ కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ మూడు కేసుల్లో ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ (Modi)వంశానికి సంబంధించిన రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సమన్లు పంపితే..మరో రెండు కేంద్రమంత్రి అమిత్‌షా(Amit Shah)పై కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్‌కు గాను కోర్టు విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపింది.
ఒకటి తర్వాత మరొకటి..
ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ కోర్టు ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్‌ను తప్పు పడుతూ నమోదైన పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో దొంగలందరి ఇంటి పేరు మోదీనే ఎందుకుంటాయని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీపరువునష్టం దావా వేయడంతో సూరత్ (Surat)కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండే రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
కామెంట్స్‌పై కోర్టులు ఆగ్రహం..
కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఈ కామెంట్ చేశారు. ఆ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. అయితే రాహుల్‌గాంధీపై నేరం నిరూపించడం, జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పివ్వడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇది అప్రజాస్వామికమని మండిపడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు, సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో జార్ఖాండ్‌లోని దిగువ కోర్టులు మోదీ, అమిత్‌షాలపై రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌పై సమన్లు పంపారు. కోర్టు విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది న్యాయస్థానం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Jarkhand, Narendra modi, National News, Rahul Gandhi