కర్ణాటకలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కి చేరింది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు పతనం అంచున నిలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల మనసు గెలుచుకునేందుకు సీఎం కుమారస్వామి గత వారం రోజులుగా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రెబల్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. అసెంబ్లీలో బలపరీక్షను ఇవాళే నిర్వహించనున్నట్లు కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్ స్పష్టంచేశారు. దీంతో మరికొన్ని గంటల్లో కర్ణాటకలోని సంకీర్ణ సర్కారు భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందలో భాగంగా ముఖ్యమంత్రి మార్పు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ప్రభుత్వం చేజారకుండా ఉండేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ...కాంగ్రెస్ సీఎంకు మద్దతిచ్చేందుకు సిద్ధమని స్పష్టంచేశారు.
మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డీకే శివకుమార్, పరమేశ్వరలో ఎవరో ఒకరు సీఎం అయ్యేందుకు జేడీఎస్ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీఎంగా శివకుమార్ రేసులో ముందున్నట్లు సమాచారం. దేవెగౌడ, మరికొందరు కూటమి ఎమ్మెల్యేలు ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం సిద్ధరామయ్య వైపు మొగ్గుచూపుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని స్వయంగా డీకే శివకుమార్ సంకేతాలిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Congress-jds, Karnataka, Karnataka bjp, Karnataka political crisis