రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) తమ పార్టీ మద్దతు ఇవ్వవచ్చని కర్ణాటకకు చెందిన జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Kumaraswamy) బుధవారం సూచించారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముర్ము జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ మద్దతు కోరారని ఆయన తెలిపారు. దేవేగౌడను (Deve Gowda)వ్యక్తిగతంగా కలవడానికి ముర్ము సమయం కూడా కోరారని చెప్పారు. ఆమె ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేసి తమ పార్టీ మద్దతు కోరారు. అలాగే దేవేగౌడను కలవడానికి సమయం కూడా అడిగారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తమ మద్దతు కోరాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే వారికి మెజారిటీ ఉందని, చిత్తశుద్ధితో, ఉదారంగా దేవెగౌడ మద్దతు కోరారని కుమారస్వామి చెప్పారు. ఆమె ఇప్పటికే గెలిచారని.. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని తెలిపారు.
త్వరలోనే దీనిపై పార్టీలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ నిర్ణయం ఏమిటన్నది మీడియాకు ఇప్పటికే అర్థమై ఉంటుందని పరోక్షంగా తమ మద్దతు ద్రౌపది ముర్ముకు ఉంటుందని చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరి అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలిస్తామని.. ఇక్కడ కాంగ్రెస్ లేదా బిజెపి లేదా ఏ బి-టీమ్ అనే ప్రశ్న లేదని చెప్పారు. ముర్ము నేపథ్యాన్ని.. ఆమె పోరాటాన్ని తాను చూశానని జేడీఎస్ నేత తెలిపారు.
ఇటీవల ముర్మును అనుకూల, వివాదరహిత అభ్యర్థిగా అభివర్ణించిన దేవెగౌడ.. ఆమెను కేవలం గిరిజన అభ్యర్థిగా మాత్రమే చూడాలని కోరుకోవడం లేదని, రాష్ట్రపతి పదవికి ఆమె సమర్ధురాలు అని అన్నారు. ఇక జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు.
Uddhav Thackrey: నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు.. సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా
క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. మంత్రులకు థ్యాంక్స్ చెప్పిన సీఎం ఉద్ధవ్..
కేంద్రంలోని అధికార ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. ముర్ముకు రాష్ట్రపతిగా గెలిచేందుకు కావాల్సిన మెజార్టీ ఉన్నప్పటికీ.. విపక్షాల్లోని పలు పార్టీల మద్దతు కూడా కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పలు ఇతర పార్టీలను కలిసేందుకు, వారి మద్దతు కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.