హోమ్ /వార్తలు /national /

Chiranjeevi: చిరంజీవి రీ ఎంట్రీపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్.. పార్టీలో చేరతారా? బయటి నుంచి మద్దతా?

Chiranjeevi: చిరంజీవి రీ ఎంట్రీపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్.. పార్టీలో చేరతారా? బయటి నుంచి మద్దతా?

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే, మారుతున్న పరిస్థితుల్లో అది ఎంత మేర ఉంటుందనేది చూడాలన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వాడివేడి సంవాదం జరుగుతున్న సమయంలో మరో బాంబు పేల్చారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని, జనసేనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారంటూ బాంబు పేల్చారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కు కొన్నాళ్లు సినిమాలు చేయమని సలహా ఇచ్చింది కూడా చిరంజీవేనని, 2024 ఎన్నికల నాటికి చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. చిరంజీవి తమతో మాట్లాడుతూ బీజేపీ - జనసేన కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

    ఈ క్రమంలో జనసేన పార్టీ మాజీ నేత ‘జేడీ’ లక్ష్మీనారాయణ స్పందించారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే, మారుతున్న పరిస్థితుల్లో అది ఎంత మేర ఉంటుందనేది చూడాలన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించిన చిరంజీవి ఎంతోకొంత కచ్చితంగా ప్రభావం చూపిస్తారని జేడీ లక్ష్మీనారాయణ అంచనా వేశారు. అయితే, ఆయన ఏ విధంగా ముందుకొస్తారు? పార్టీలో చేరతారా? బయట నుంచి మద్దతు పలుకుతారా? ఏ దిశగా వ్యూహరచన ఉంటుందనేది చూడాలన్నారు. కానీ, రాజకీయాల్లో మాత్రం ఇదో ఇంట్రస్టింగ్ డెవలప్‌మెంట్ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

    First published:

    Tags: Andhra Pradesh, Bjp-janasena, JD Lakshmi Narayana, Megastar Chiranjeevi, Pawan kalyan, Somu veerraju

    ఉత్తమ కథలు