ఏపీలో రాజధాని రగడ చల్లారడం లేదు. ఓ వైపు అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే... మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం తమ వ్యాఖ్యలతో రాజధాని వేడిని మరింత రాజేస్తున్నాయి. తాజాగా మరోసారి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ నిర్ణయంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. రాజధాని విషయంలో పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలున్నప్పుడు... పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
తనకు పార్టీ నిర్ణయం కన్నా... తనను గెలిపించే ప్రజలే ముఖ్యమన్నారు రాపాక. చిరంజీవి సైతం మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించారని ఈ సందర్బంగా గుర్తు చేశారాయన. పవన్ కల్యాణ్ సైతం మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని.. కానీ... రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని కోరుతున్నారన్నారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదన్నారు. మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు రాపాక. ప్రభుత్వ నిర్ణయాలు కమిటీల ద్వారా బయటకొస్తాయన్నారు. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ కల్యాణ్ ఆందోళన చేశారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap capital, AP News, AP Politics, Janasena mla varaprasad, Janasena party, Pawan kalyan