హోమ్ /వార్తలు /national /

Pawan Kalyan: బీజేపీకి పవన్ కళ్యాణ్ మరో షాక్.. ఈసారి నాగార్జునసాగర్‌లో..

Pawan Kalyan: బీజేపీకి పవన్ కళ్యాణ్ మరో షాక్.. ఈసారి నాగార్జునసాగర్‌లో..

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: తెలంగాణలో బీజేపీ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గౌరవం లేని చోటు ఉండాల్సిన అవసరం లేదంటూ.. పరోక్షంగా బీజేపీతో కలిసి పని చేయాల్సిన అవసరం లేదనే సంకేతాలు ఇచ్చారు.

  తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ బీజేపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఎన్నికలు జరిగిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటించి సంచలన సృష్టించిన పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కమలం పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని.. దుబ్బాక తరహాలోనే ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.

  బీజేపీ ప్లాన్ ఇలా ఉంటే.. ఇక్కడ జనసేన తరపున అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని జనసేన నేరుగా ప్రకటించకపోయినప్పటికీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


  తెలంగాణలో బీజేపీ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గౌరవం లేని చోటు ఉండాల్సిన అవసరం లేదంటూ.. పరోక్షంగా బీజేపీతో కలిసి పని చేయాల్సిన అవసరం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ కోసం జనసేన కమిటీలను ఏర్పాటు చేయడంతో.. ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేసి జనసేన బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

  BJP Janasena alliance in ghmc, ghmc elections 2020, janasena bjp, telangana news, ghmc news, బీజేపీ జనసేన, జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020, జనసేన బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు
  పవన్ కళ్యాణ్, బండి సంజయ్ (ఫైల్ పోటో)

  అదే జరిగితే సాగర్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో పాటు బీజేపీకి పడాల్సిన జనసేన ఓటు కూడా పక్కకపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సాగర్ ఉప ఎన్నికకు ముందు కమిటీలు ఏర్పాటు చేసిన జనసేన.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఊహించని షాక్ ఇస్తుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Janasena, Nagarjuna Sagar By-election, Pawan kalyan

  ఉత్తమ కథలు