హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: బండి సంజయ్ అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్.. అధికారుల తీరుపై పవన్ అనుమానం

Dubbaka ByPoll: బండి సంజయ్ అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్.. అధికారుల తీరుపై పవన్ అనుమానం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్టును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండిచారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం దుందుడుకు చర్య అని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్, బీజేపీ నాయకులపై పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాఖ్యానించారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలన్నారు. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థిని, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడం గర్హనీయమన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు.

  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చేసారు. సిద్దిపేట కు వెళ్తుండగా అరెస్ట్ చేసారు పోలీసులు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ ఇంట్లో అలాగే అతను బంధువుల ఇంట్లో పోలీసులు తనిఖీలు చెప్పట్టారు. ఇందులో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.

  స్వాధీనం చేసుకున్న నగదును లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని బీజేపీ నేతలు అలాగే బండి సంజయ్ సిద్దిపేట కు బయల్దేరారు. కానీ సిద్దిపేట లో సంజయ్ ని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ సమయంలో పోలీసులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్ ని సిద్దిపేట నుండి కరీంనగర్ కి తీసుకెళ్తున్నారు పోలీసులు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు