హోమ్ /వార్తలు /national /

కాసేపట్లో పవన్ రైతు సౌభాగ్య దీక్ష.. సీఎం జగన్ టార్గెట్..

కాసేపట్లో పవన్ రైతు సౌభాగ్య దీక్ష.. సీఎం జగన్ టార్గెట్..

పీలేరులో పవన్ కళ్యాణ్

పీలేరులో పవన్ కళ్యాణ్

Rythu Soubhagya Deeksha : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టనున్నారు. రైతుల కోసం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టనున్నారు. రైతుల కోసం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల సమస్యను బలంగా తెలియజేయడానికే ఈ దీక్షను తలపెట్టినట్లు పవన్ తెలిపారు. వరి పంట వేయడానికి రైతులు భయపడుతున్నారని.. రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో తిరిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని.. వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బకాయిలు చెల్లించి మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కాగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌, తన సోదరుడు నాగబాబుతో కలసి పవన్‌ దీక్షా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు.

First published:

Tags: AP News, AP Politics, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు