హోమ్ /వార్తలు /national /

పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్... పిచ్చి పిచ్చిగా మాట్లాడితే...

పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్... పిచ్చి పిచ్చిగా మాట్లాడితే...

 ‘నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి?. నేను గెలిచిన ఎమ్మెల్యేని. వాళ్లు ఓడిపోయిన వారు. జనసేన పార్టీ వల్ల, ఆ కార్యకర్తల వల్ల నేను గెలవలేదు. నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదు. నా సొంత శక్తి తో ఎమ్మెల్యేగా గెలిచా.’  అని రాపాక వరప్రసాద్ అన్నారు.

ఇంకా చదవండి ...

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హెచ్చరిక జారీ చేశారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు రాపాక వరప్రసాద్ హాజరుకాకపోవడంతో ఆయనకు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే, అది ఫేక్ న్యూస్ అని జనసేన వర్గాలు చెప్పాయి. కానీ, అది ఫేక్ న్యూస్ అని తెలిసేలోపే రాపాక వరప్రసాద్ షోకాజ్ నోటీస్ అంశంపై స్పందించారు. ‘నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి?. నేను గెలిచిన ఎమ్మెల్యేని. వాళ్లు ఓడిపోయిన వారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉందంటే నాకు మాత్రమే ఉంది. జనసేన పార్టీ వల్ల, ఆ కార్యకర్తల వల్ల నేను గెలవలేదు. నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదు. నా సొంత శక్తి తో ఎమ్మెల్యేగా గెలిచా. నాకు ఎవరి భిక్ష అవసరం లేదు. అంతగా నన్ను గెలిపించే వాళ్లే అయితే ఆయన ఎందుకు ఓడిపోయారు రెండు చోట్లా?. ముందు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. నన్ను ఆయన సస్పెండ్ చేయడం ఏంటి?. సిగ్గుగా ఉంది ఈ మాట చెప్పుకోవడానికి కూడా. దిశానిర్దేశం లేని పార్టీలో ఉండటం నాకే ఇష్టం లేదు. నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి నాకు ఉంది. ఆయనకు రాష్ట్రంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందా అని అడుగుతున్నా. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు, షోకాజ్ నోటీసులు అంటూ చెత్త ప్రకటనలు చెత్త పేపర్ లలో విడుదల చేస్తే నేను ఏం చేయాలో నాకు తెలుసు. ’ అని రాపాక వరప్రసాద్ హెచ్చరించారు.

    First published:

    Tags: Janasena mla varaprasad, Pawan kalyan, Rapaka varaprasad

    ఉత్తమ కథలు