హోమ్ /వార్తలు /national /

మరోసారి జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే..

మరోసారి జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే..

సీఎం జగన్

సీఎం జగన్

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు.

  ఏపీకి చెందిన ఒకే ఒక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కొనియాడారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడిన రాపాక... ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు.

  గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ కోరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Janasena, Rapaka varaprasad, Ysrcp

  ఉత్తమ కథలు