హోమ్ /వార్తలు /national /

నేను వైసీపీ వ్యక్తిని.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నేను వైసీపీ వ్యక్తిని.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాపాక వరప్రసాద్, వైఎస్ జగన్

రాపాక వరప్రసాద్, వైఎస్ జగన్

జనసేన గాలికి వచ్చిన పార్టీయన్న ఆయన.. పోటీ ఉండాలనే జనసేనలోకి వెళ్లాలని చెప్పారు. అంతేకాదు జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు రాపాక వరప్రసాద్.

    జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏం చేసినా సంచలనమే. జనసేన నుంచి గెలిచిన రాపాక ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్‌పై బాహాటంగానే ప్రశంసలు కురిపిస్తూ వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాపాక వరప్రసాద్. తాను వైసీపీకి చెందిన వ్యక్తిననంటూ బాంబు పేల్చారు. జనసేన గాలికి వచ్చిన పార్టీయన్న ఆయన.. పోటీ ఉండాలనే తాను జనసేనలోకి వెళ్లాలని చెప్పారు. అంతేకాదు జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు రాపాక వరప్రసాద్. జనసేన ఓ వర్గానికి పార్టీ అని.. భవిష్యత్తులో జనసేన పార్టీ ఉనికే ఉండదని స్పష్టంచేశారు.

    ''రాజోలు వైసీపీలోని మూడు వర్గాల్లో నాదో గ్రూపు. వైసీపీలో గ్రూపులు అంతం కావాలంటే జగన్ నిర్ణయం తీసుకోవాలి. కుమ్ములాటలు పార్టీకి మంచిది కాదు. త్వరలోనే ఫుల్‌స్టాప్ పెట్టాలి.'' అని రాపాక వరప్రసాద్ అన్నారు. కాగా, రాపాక కేవలం జనసేన పార్టీపై మాత్రమే గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ పార్టీలో కనిపించలేదు. జనసేన అధినేత పవన్ చేసిన ర్యాలీల్లోనూ ఆయన ఎక్కడా పాల్గొనలేదు. అసెంబ్లీలోనే జనసేన స్వరం వినిపించకుండా వైసీపీకి వంత పాడారు. ఈ క్రమంలో ఆయన్ను పవన్ కూడా పట్టించుకోవడం మానేశారు. ఐతే తాను వైసీపీ మనిషినని రాపాక తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Rapaka varaprasad

    ఉత్తమ కథలు