హోమ్ /వార్తలు /national /

రూట్ మార్చేస్తున్న రాపాక... వైసీపీ వైపు అడుగులు?

రూట్ మార్చేస్తున్న రాపాక... వైసీపీ వైపు అడుగులు?

k (File)

k (File)

Rapaka Varaprasad : ఎమ్మెల్యే అంటే కచ్చితంగా అధికారంలో ఉండాల్సిందేనా? ఏ పార్టీ తరపున గెలిచినా... వీలు చూసుకొని అధికార పార్టీలోకి జంప్ అవ్వడమే ఎమ్మెల్యే లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అవునన్నట్లుగా సమాధానం వస్తోంది రాపాక వేస్తున్న అడుగుల్ని చూస్తే...

ఇంకా చదవండి ...

  Rapaka Varaprasad : జనసేన పార్టీలో ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... వైసీపీ వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఐదేళ్లపాటూ... ప్రతిపక్షంలో అదికూడా జనసేనలో ఏకైక ఎమ్మెల్యేగా ఉండటం కష్టమనుకుంటున్న ఆయన... వీలు చూసుకొని వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది రాజకీయ ముఖచిత్రం చూస్తుంటే. జనసేనలో ఉంటే తాను నంబర్ వన్‌గా ఉంటాననీ అదే వైసీపీలోకి వెళ్తే తన నంబర్ 152 అవుతుందన్న రాపాక... ఇప్పుడు ఆ పెద్ద నెంబరే బెటరనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి దూరంగా ఉంటున్న రాపాక... వైసీపీ ఎమ్మెల్యేలతో మాత్రం దగ్గరగా ఉంటూ... తన రూట్ మారిందనే సంకేతాలు ఇస్తున్నారు.

  వైసీపీ అధినేత, సీఎం జగన్... మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు... పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే, రాపాక మాత్రం సమర్థించారు. వీలు చిక్కినప్పుడల్లా... వైసీపీ సూపర్ అంటున్నారు. అందుకే ఇటీవల పవన్ కళ్యాణ్... రాపాకను పెద్దగా పట్టించుకోవద్దనీ, ఆయనేంటో అర్థం కావట్లేదని అనేశారు. తాజాగా తిరుమల వెళ్లిన రాపాక... మరోసారి మూడు రాజధానులకు ఓకే అన్నారు. చిత్రమేంటంటే... అలా మూడు రాజధానులు ఉంటేనే తమ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కానీ అమరావతిలో రైతులు మాత్రం... అమరావతి రాజధానిగా ఉంటేనే గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాపాక పరిస్థితి ఎలా ఉందంటే... జనసేనకు దూరంగా లేననీ అలాగని దగ్గరగానూ లేననీ, జనసేనలో ఉన్నానని ఆయనే చెప్పారు.

  నిజానికి రాపాక జనసేనలో ఉంటే ఆయనకు దక్కే గుర్తింపే వేరు. అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ తర్వాత... ఏకైక సీటు సాధించింది జనసేనే. కాబట్టి... రాపాకకు అసెంబ్లీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలా కాకుండా వైసీపీలో చేరితే... ఓ నాల్రోజులు అంతా పలకరిస్తారు. ఆ తర్వాత గుంపులో గోవిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అసెంబ్లీ సర్కిల్స్‌లో. కానీ రాపాక మాత్రం... జనసేనలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదనీ... అదే వైసీపీలోకి జంప్ అయితే... నిధులు రాబట్టుకొని... తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే... జగన్ వైపు నుంచి రాపాకకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు తెలిసింది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అందువల్ల వైసీపీలోకి ఎప్పుడెళ్లేదీ ఇప్పుడు రాపాక చేతిలో ఉంది. తన చేతి రాతల్ని ఎలా రాసుకుంటారో... మున్ముందు మనం చూడగలం.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Janasena party, Rapaka varaprasad

  ఉత్తమ కథలు