హోమ్ /వార్తలు /national /

జగన్ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ప్రశంసల జల్లు

జగన్ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ప్రశంసల జల్లు

జగన్, వరప్రసాద్(ఫైల్ ఫోటో)

జగన్, వరప్రసాద్(ఫైల్ ఫోటో)

సోమవారం రాజోలు పంచాయతీ కార్యాలయంలో నూతన వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాపాక వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.

  ఏపీ సీఎం జగన్‌కు మరోసారి జైకొట్టారు జనసేన ఎమ్మెల్యే రాపాక. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న ఆయన తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాకాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాంటి ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సోమవారం రాజోలు పంచాయతీ కార్యాలయంలో నూతన వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాపాక వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.

  'ఆరోగ్య శ్రీ పథకం 1059 వ్యాధులకు వర్తిస్తుంది. ఏప్రిల్‌ నాటికి 2059 వ్యాధులకు వర్తించేలా ప్రభుత్వం చూస్తోంది. రూ.వెయ్యి ఖర్చు మించిన ప్రతి వ్యాధిని పథకం కింద వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేన్సర్‌కు సంబంధించిన అన్ని వ్యాధులనూ ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును జారీ చేయటం అభినందనీయం' అని రాపాక వరప్రసాద్ అన్నారు.

  కాగా, కొన్ని రోజులుగా రాపాక వరప్రసాద్ వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతుంటే.. రాపాక మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి ఆయన పాలాభిషేకం చేశారు. మూడు రాజధానుల ప్రకటనను సైతం ఆయన సమర్థించారు. అంతేకాదు ప్రతి చిన్న దానికీ ఆందోళణ చేయడం సరికాదని.. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌నే రాపాక తప్పుబట్టారు. ఈ క్రమంలో రాపాక వ్యవహారం జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Rapaka varaprasad

  ఉత్తమ కథలు