హోమ్ /వార్తలు /national /

సొంత పార్టీ నేత షాక్.. పవన్ కళ్యాణ్‌కు బయటి వారి మద్దతు...

సొంత పార్టీ నేత షాక్.. పవన్ కళ్యాణ్‌కు బయటి వారి మద్దతు...

సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ అభిమతానికి పూర్తి భిన్నంగా వెళ్తుంటే, టీడీపీ నేతలు మాత్రం జనసేనానికి వెనకేసుకు రావడం విశేషం.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయనకు సొంత పార్టీ నేత షాక్ ఇస్తుంటే.. బయటి పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద జగన్ కామెంట్స్ చేశారు. రోజా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించింది. అయితే, జనసేన నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. పార్టీ అధినేత గురించి జగన్, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆయన మౌనంగానే ఉండిపోతున్నారు. దీంతోపాటు ఏపీలో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే, దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఏపీలో ఇంగ్లీష్ మీడియంకు పూర్తి మద్దతు ప్రకటించారు.

    అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ అభిమతానికి పూర్తి భిన్నంగా వెళ్తుంటే, టీడీపీ నేతలు మాత్రం జనసేనానికి వెనకేసుకు రావడం విశేషం. పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్ల మీద పరోక్ష వ్యాఖ్యలు చేసిన జగన్‌ను చంద్రబాబు తప్పుపట్టారు. తెలుగు మీడియం పెట్టమంటే పెళ్లాల గురించి మాట్లాడతారేంటంటూ ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా పవన్ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత మద్దతుగా నిలిచారు. ఇంగ్లీష్ మీడియం, ఇతర అంశాలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా.. సభలో లేని పవన్ మీద వ్యాఖ్యలు చేస్తున్న వారికి కనీసం కౌంటర్ ఇవ్వకపోవడం జనసేన వర్గాల్లో అసంతృప్తిని నింపుతోంది.

    First published:

    Tags: Andhra Pradesh, Ap assembly sessions, Janasena party, Pawan kalyan, Rapaka varaprasad, TDP

    ఉత్తమ కథలు