హోమ్ /వార్తలు /national /

పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల హ్యాండ్ ఇస్తారా ?

పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల హ్యాండ్ ఇస్తారా ?

నాదెండ్ల మనోహర్ తండ్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో... ఇప్పుడు అందరి చూపు మరోసారి నాదెండ్ల మనోహర్‌పైనే నెలకొంది.

నాదెండ్ల మనోహర్ తండ్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో... ఇప్పుడు అందరి చూపు మరోసారి నాదెండ్ల మనోహర్‌పైనే నెలకొంది.

నాదెండ్ల మనోహర్ తండ్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో... ఇప్పుడు అందరి చూపు మరోసారి నాదెండ్ల మనోహర్‌పైనే నెలకొంది.

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జనసేన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న అంశంపై ఆ పార్టీ వర్గాలకు కూడా ఇంకా ఒక స్పష్టత రావడం లేదు. ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులను, పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. రాజకీయాల్లో కొనసాగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్... పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతానని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా పార్టీ నేతలతో చర్చలు కూడా జరిపిన పవన్ కళ్యాణ్... వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎంతగా ధైర్యం చెబుతున్నా... భవిష్యత్తులో జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? పార్టీలో కొనసాగాలా ? అనే విషయంపై అనేకమంది నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాంరాం చెబుతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని వారు వివరణ ఇచ్చుకున్నారు. నాదెండ్ల మనోహర్ ఇప్పటికీ పవన్‌తోనే ఉన్నారు. ఆయనతో కలిసి అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో నాదెండ్ల మనోహర్‌కు జనసేనను వీడే ఆలోచన లేదని చాలామంది భావించారు. అయితే నాదెండ్ల మనోహర్ తండ్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో... ఇప్పుడు అందరి చూపు మరోసారి నాదెండ్ల మనోహర్‌పైనే నెలకొంది.

  తన కుమారుడు బీజేపీలో చేరతాడో లేదో తాను చెప్పలేదని వివరించిన నాదెండ్ల భాస్కర్ రావు... తాను బీజేపీలో చేరే విషయాన్ని ఆయనకు ముందుగానే చెప్పానని అన్నారు. అమెరికా నుంచి వచ్చిన తరువాత బీజేపీలో చేరే విషయంపై మనోహర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. దీంతో నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ మారే విషయాన్ని సీరియస్‌గానే ఆలోచిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  అయితే ఇప్పటికప్పుడు కాకపోయినా... భవిష్యత్తులో అయిన మనోహర్ బీజేపీలో చేరే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌తో కలిసి అమెరికాలో ఉన్న నాదెండ్ల మనోహర్... ఏపీకి వచ్చిన వెంటనే బీజేపీ కండువా కప్పుకుని పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

  First published:

  Tags: Andhra Pradesh, Bjp, Janasena, Nadendla Manohar, Pawan kalyan

  ఉత్తమ కథలు