ఇంటా.. బయటా.. ఎప్పుడూ చాలా సింపుల్‌గా కనిపిస్తారు పవన్ కల్యాణ్. ఓ రాజకీయ పార్టీకి అధినేత, సినీ హీరో అయినప్పటికీ.. ఆ ఆటిట్యూట్ ఎక్కడా చూపించరు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ బయటపడింది. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన తరవాత జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకొనేటప్పుడు విమానం ఆలస్యం అని సమాచారం అందిడంతో.. మార్గమధ్యమంలో ఓ జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.
ఇంటి వరండలాలో అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. తల కింద దిండు తప్ప.. ఎలాంటి బెడ్‌షీట్, చాప లేకుండానే ఫ్లోర్‌పై పడుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ జనసేన కార్యకర్త ఇంట్లో పవన్ కల్యాణ్ పడుకున్నాడని తెలిసి మిగతా కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. పవన్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా నాయకులకు, పవన్ కల్యాణ్‌కు ఇది తేడా అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Janasena, Janasena party, Pawan kalyan