హోమ్ /వార్తలు /national /

Chiranjeevi - Pawan Kalyan: జనసేనలోకి చిరంజీవి రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Chiranjeevi - Pawan Kalyan: జనసేనలోకి చిరంజీవి రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కంటే ముందే వాళ్ళు పుట్టి చనిపోయారు. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు పవన్. ఇది తెలిసిన తర్వాత అంతా అయ్యో అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే పవన్ చాలా బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలతో మరో రెండేళ్ళ వరకు చాలా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్.

పవన్ కంటే ముందే వాళ్ళు పుట్టి చనిపోయారు. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు పవన్. ఇది తెలిసిన తర్వాత అంతా అయ్యో అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే పవన్ చాలా బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలతో మరో రెండేళ్ళ వరకు చాలా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కాపు సంక్షేమ సేన సమావేశంలో ఆయన చిరంజీవి రీ ఎంట్రీ మీద స్పందించారు.

  మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కాపు సంక్షేమ సేన సమావేశంలో ఆయన చిరంజీవి రీ ఎంట్రీ మీద స్పందించారు. ‘చిరంజీవి ఎప్పుడూ నా మేలు కోరుతారు. అందులో రెండో మాటలేదు. ఆయన రాజకీయ అభిప్రాయాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తా. నాదెండ్ల మనోహర్ చెప్పింది ఏంటంటే, ఒక తమ్ముడుగా నేను ఎప్పుడూ విజయం సాధించాలనే కోరతారు తప్ప అపజయం సాధించాలని కోరుకోరు. దాన్ని అలాగే చూడాలి. జనసేన పార్టీలో చిరంజీవి చేరతారా లేదా అనేది ఈరోజే చెప్పలేం. పరిస్థితిని బట్టి ఉంటుంది. అది చిరంజీవి అభిప్రాయం. నా విజయాన్ని, బాగుని, ప్రజల బాగుని ఆకాంక్షించే వ్యక్తి చిరంజీవి.’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని, జనసేనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ బాంబు పేల్చారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కు కొన్నాళ్లు సినిమాలు చేయమని సలహా ఇచ్చింది కూడా చిరంజీవేనని, 2024 ఎన్నికల నాటికి చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. చిరంజీవి తమతో మాట్లాడుతూ బీజేపీ - జనసేన కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

  ఇక జనసేన పార్టీ మాజీ నేత ‘జేడీ’ లక్ష్మీనారాయణ స్పందించారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే, మారుతున్న పరిస్థితుల్లో అది ఎంత మేర ఉంటుందనేది చూడాలన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించిన చిరంజీవి ఎంతోకొంత కచ్చితంగా ప్రభావం చూపిస్తారని జేడీ లక్ష్మీనారాయణ అంచనా వేశారు. అయితే, ఆయన ఏ విధంగా ముందుకొస్తారు? పార్టీలో చేరతారా? బయట నుంచి మద్దతు పలుకుతారా? ఏ దిశగా వ్యూహరచన ఉంటుందనేది చూడాలన్నారు. కానీ, రాజకీయాల్లో మాత్రం ఇదో ఇంట్రస్టింగ్ డెవలప్‌మెంట్ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Megastar Chiranjeevi, Nadendla Manohar, Pawan kalyan

  ఉత్తమ కథలు