సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. ముఖ్యంగా అభిమానులు పవన్ ను ఎంత ఆరాధిస్తారో.. పవన్ కళ్యాణ్ కూడా వారిని అంతాలానే ప్రేమిస్తారు. వారి కోసం ఏం చేయడానికి పవన్ సిద్ధంగా ఉంటారు. బహిరంగంగానే ఆ విషయాన్నిప్రకటించారు కూడా.
తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు పవన్. కృష్ణా జిల్లా లింగాల గ్రామంలోని క్యాన్సర్ తో బాధపడుతున్న.. జనసేన అభిమాని భార్గవ్ ను పరామర్శించారు. అతడి స్వగృహానికి వెళ్లి మరి అతడి ఆరోగ్యంపై ఆరా తీశారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్యం పరిస్థితిని కుటుంబ సభ్యులు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ అభిమాని వైద్య ఖర్చుల కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. భార్గవ్ కు ధైర్యాన్ని చెప్పి.. అతడికి వెండి గణపతి విగ్రహాన్ని బహుమతిగా అందించి.. అంతా మంచే జరుగుతుందని ఆశించారు.
తరువాత బార్గవ్ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. భార్గవ్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నానని.. అతడికి వైద్యం అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడనని.. అధైర్య పడొద్దు అంటూ ధైర్యం చెప్పారు.
భార్గవ్ కు మూడు నెలల కిందటే క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలుసుకున్న పవన్. జనసేన పార్టీ నుంచీ వైద్యులను పంపిస్తామన్నారు. తగిన సేవలు వారు అందిస్తారని భరోసా కల్పించారు. ఎన్.ఆర్.ఐ. దాతల నుంచి సహాయం అందేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తాయి అని పవన్ వారికి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను చూసి అభిమాని భార్గవ్ ఆనందంతో పరవశించి పోయారు. అతడి తల్లి దండ్రులకు కూడా కొండత భరోసా లభించినట్టు అయ్యింది. తమ కుమారుడు త్వరగా కోలుకుంటాడనే నమ్మకం తమకు కలిగింందని ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా లింగాల గ్రామం వస్తున్నారని తెలియడంతో భారీగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారీగా గుమికూడిన అభిమానులు పవన్ తో ఫోటోలు, ఆటో గ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ ఓటు వేసేది ఎక్కడో తెలుసా?
మరోవైపు పవన్ రేపు పడమట లంకలోని కొమ్మ సీతారామయ్య జెడ్పి బాలికల పాఠశాలలో పవన్ తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పడమట లంకలో అప్పుడే సందడి మొదలైంది. పవన్ ఓటేయడానికి వస్తున్నారని అని తెలియడంతో భారీగా పవన్ చూసేందుకు అతడి ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు ముందుగానే పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరూ గుమికూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan