హోమ్ /వార్తలు /national /

వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద... జనసేన, వైసీపీ రాళ్ల దాడి

వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద... జనసేన, వైసీపీ రాళ్ల దాడి

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే

ఈ ఘటనలో జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతోకాకినాడలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి ముట్టడికి జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. కాకినాడలో భానుగుడి సెంటర్ నుంచి ర్యాలీగా బయల్దేరిన జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల దాడికి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతోకాకినాడలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచల్పించిన మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ వేదిక మీదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Janasena, Janasena party, Pawan kalyan, Ysrcp

ఉత్తమ కథలు